Bigg Boss 10 | తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు’ సీజన్ 10కు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు మరింత గ్రాండ్‌గా పదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ప్రోమోతో షోపై అంచనాలు మరింత పెరిగాయి.ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. గత కొన్ని సీజన్లుగా తన స్టైల్, హోస్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగార్జున, ఈసారి కూడా కంటెస్టెంట్లను ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ముఖ్యంగా ‘దశావతారం’ అనే కాన్సెప్ట్‌తో ఈ సీజన్‌ను సరికొత్తగా డిజైన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత సీజన్లతో పోలిస్తే కొత్త రూల్స్, వినూత్న టాస్కులు, మరింత కఠినమైన గేమ్ ప్లాన్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే, షో ప్రారంభానికి ముందే కంటెస్టెంట్ల జాబితాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ పలువురు సెలబ్రిటీల పేర్లు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్, టెలివిజన్, యూట్యూబ్, సోషల్ మీడియా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ లిస్ట్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
వైరల్ అవుతున్న పేర్లలో ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, నందూస్ వరల్డ్ నందూ, పండు మాస్టర్, జ్యోతి, రాయల్ మెక్ రమణ, తేజస్విని గౌడ, శివ్ కుమార్, చంద్రహాస్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరెవరు నిజంగా హౌస్‌లోకి అడుగుపెడతారన్న విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.అయితే ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న పేరు మాత్రం టెలివిజన్ నటి పల్లవి గౌడది. పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన పల్లవి గౌడ, తన అందం, నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు.దీంతో ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో పల్లవి గౌడ కనిపించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఆమె ఎంట్రీ ఇస్తే షోకు గ్లామర్‌తో పాటు మంచి ఫాలోయింగ్ కూడా దక్కే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
View this post on Instagram
A post shared by Haircare & Skincare Salon Bangalore | Hair Magix ™️ (@hairmagixsalonhsr)