Bigg Boss-7 Telugu | బిగ్‌బాస్ సీజన్-7 ఆరో వారానికి సంబంధించిన నామినేషన్లు వాడి వేడిగా సాగాయి. 14మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఏడో సీజన్లో ఇప్పటివరకు ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. తొలివారం కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా , మూడు, నాలుగు వారాల్లో సింగర్ దామిని భట్ల , రతిక రోజ్, ఐదో వారం శుభ శ్రీ రాయగురు ఇలా వరుసగా ఐదుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇలా వరుసగా అమ్మాయిలు ఎలిమినేట్ అవడం ఇదే తొలిసారి. ఇక శుభ శ్రీ ఎలిమినేషన్ రోజునే వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా ఐదుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు.
ఇక ఇప్పుడు మళ్లీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్ల సంఖ్య 14కు పెరిగింది. ఇక అలా 5గురు ఎంట్రీ ఇచ్చారో లేదో ఆరోవారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. ఆరోవారం నామినేషన్లో అమర్దీప్, యావర్, శోభాశెట్టి, టేస్టీ తేజలతో పాటు కొత్తగా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా మూర్తి, అశ్విని శ్రీ, నయని పావనిలకు ఓట్లు నిర్వహించారు. ఈ ఏడుగురిలో అమర్దీప్, యావర్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. శోభా శెట్టితో పాటు కొత్తగా వచ్చిన నయని పావని డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక ఫైనల్ నామినేషన్లో శోభా శెట్టి సేఫ్ అవగా నయని పావని ఎలిమినేట్ అయింది.
ఇలా వచ్చిన వారమే నయని పావని ఎలిమినేట్ అవడం గమనార్హం. అయితే దీనిపై పలువురు బిగ్‌బాస్ ఫ్యాన్స్ వ్యతిరేకత చూపిస్తున్నారు. అసలు శోభా శెట్టిని ఎలిమినేషన్ నుంచి తప్పించి నయని పావనిని బుక్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. కొత్తగా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో అంబటి అర్జున్, నయని పావనిలే బాగా ఆడుతున్నారని.. నామినేషన్స్‌లో ఉన్న వారిలో నయని పావని చాలా బెటర్ అని.. అలాంటప్పుడు ఆమెను ఎలిమినేట్ చేయడం అన్ఫేయిర్ అని తెలుపుతున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే..శోభాశెట్టి హౌజ్‌లోకి వెళ్లేముందే ఎన్ని వారాలన్నది ఫిక్సయి ఉంటుందట. దాంతో ఆమె ఎన్ని సార్లు నామినేషన్లో ఉన్నా.. గడువు పూర్తయిన తర్వాతే హౌజ్ నుంచి పంపిస్తారని సమాచారం.
అయితే శోభాశెట్టిని తప్పించడానికి బాగా పర్ఫార్మ్ చేస్తున్న నయన పావనిని ఎలిమినేట్ చేయడం అన్ఫేయిర్ అని.. అవసరమైతే నామినేషన్లో ఉన్న అశ్విని, పూజాలలో ఒకరిని చేసిన బాగుండేదని పలువురు బిగ్ బాస్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.