ప్రతి ఏడాది సంక్రాంతికి టాలీవుడ్లో సినిమాల సందడి ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్లో విడుదలై తెగ సందడి చేస్తుంటాయి. ఈ ఏడాది సంక్రాంతికి మాత్రం బడి ఫైట్ జరగనుంది. టాలీవుడ్ టాప్ హీరోలు ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్ సంక్రాంతి బరిలో నిలవనుండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే మూడు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ పోటాపోటీగా సంక్రాంతి కోసం బరిలో దిగుతుంటే ఇప్పుడు సీనియర్ హీరో వెంకటేష్ కూడా సంక్రాంతి అల్లుడిని అవుతానని అంటున్నారు. అయితే సర్కారు వారి పాట చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయనున్నట్టు శనివారం ఫస్ట్ లుక్ ద్వారా ప్రకటించారు మేకర్స్. ఇక ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని జనవరి 14న తన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్లో రూపొందుతున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుందని ఇప్పటికే ప్రకటించారు.అయితే విడుదల తేది ప్రకటించలేదు.జనవరి12న లేదంటే 15న ఈ చిత్రం విడుదల అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వెంకటేష్ – వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్ 3’ చిత్రాన్ని కూడా సంక్రాంతి కి తీసుకురావాలని చూస్తున్నారు. 2022 పండక్కి మాత్రం అన్నీ పెద్ద సినిమాలే వస్తుండటంతో బాక్సాఫీస్ దగ్గర రచ్చ మాములుగా ఉండదని అర్ధమవుతుంది.