బిగ్ బాస్ హౌజ్‌లో గుంట నక్కగా పేరు తెచ్చుకున్న రవి పలుమార్లు విమర్శలపాలవుతున్నాడు. మొదట్లో షణ్ముఖ్‌తో దూరంగా ఉన్న రవి.. తన స్ట్రాటజీ మార్చి ఈ మధ్య దగ్గరయ్యాడు. అయితే వారితో క్లోజ్‌గా ఉంటూనే వెనక వాళ్ల గురించి బ్యాడ్‌గా మాట్లాడుతున్నాడట. ఈ విషయం కాజల్ బయటపెట్టగా, షణ్ముఖ్ రవిని నామినేట్ చేసి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు. కెప్టెన్‌గా రవి, సంచాలకుడిగా కాన్ఫిడెంట్‌గా లేవు అందుకే నామినేట్ చేస్తున్నా అని అన్నాడు.
సన్నీ టీ షర్ట్ విషయంలో స్ట్రాంగ్‌గా నిలబడలేదు.. మాటలు మార్చుతూ ఉన్నావ్.. అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు షణ్ముఖ్. రెండో నామినేషన్స్‌లో భాగంగా కాజల్‌ని నామినేట్ చేశాడు షణ్ముఖ్. అయితే ప్రియాంక తనని నామినేట్ చేసినప్పటికీ ఆమెను వదిలేసి మరీ కాజల్‌ని నామినేట్ చేశాడు షణ్ముఖ్. ఇక శ్రీరామ్..సన్నీని నామినేట్ చేస్తూ అతనితో పోటీ పడ్డాడు.
ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్లో శ్రీరామ్ యాటిట్యూడ్ చూపించాడు. వీరి డిస్కషన్లో గ్రూప్ మ్యాటర్ రావడంతో.. నేను, షణ్ముఖ్, సిరి, మానస్ ఒక గ్రూప్ ఇప్పుడేమంటావ్ అని అడిగిన శ్రీరామ్.. ఆ తరువాత నేను ఐదు కోట్ల మంది ఒక గ్రూప్ ఇప్పుడు చెప్పు అని అన్నాడు. దీంతో సన్నీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఆ ఐదు కోట్లమంది గ్రూప్‌కి లీడర్ని నేను అని అన్నాడు. దీంతో ఆవేశంలో శ్రీరామ్ సన్నీని నామినేట్ చేసి కుండబద్దలు కొట్టేశాడు.ఇక రెండో నామినేషన్స్‌లో భాగంగా కాజల్‌ని నామినేట్ చేశాడు.