ముంబై : బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) ఫుడ్ లవర్‌గా భిన్న రుచులను ఆస్వాదించే ఫొటోలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తుంటుంది. లేటెస్ట్గా సండేను మహారాష్ట్ర వంటకాలతో ఎంజాయ్ చేసిన ఇమేజ్‌లను పోస్ట్ చేసింది. మహరాష్ట్రియన్ క్యూజిన్ పట్ల తన ఇష్టాన్నిసోషల్ మీడియా వేదికగా ఆమె చాటుకుంది.
వెరైటీ మసాలాలు, కరివేపాకు, స్పైసెస్తో కూడిన సాబుదానా కిచిడీని పోస్ట్ చేసిన భూమి మరో స్లైడ్‌లో మిసాల్ రెసిపీని చూపింది. ఫుడీగా పేరొందిన భూమి పెడ్నేకర్ పలుమార్లు తనకిష్టమైన డిష్‌లను పోస్ట్ చేయడంలో ఏమాత్రం తటపటాయించదు.
ఇన్‌స్టా స్టోరీస్‌లో ఘమఘుమలను వడ్డించడంలో భూమి పెడ్నేకర్ ముందుంటుంది. గతంలో రియా కపూర్ ఇంట్లో జరిగిన థ్యాంక్స్ గివింగ్ వేడుకలకు సంబంధించిన ఫుడ్ ఐటెమ్స్‌ను కూడా ఆమె సోషల్ మీడియాలో డిస్ప్లే చేశారు.