Dengue| బాలీవుడ్ ప్రముఖ నటి భూమి పడ్నేకర్ (Bhumi Pednekar) ప్రమాదకర డెంగ్యూ జ్వరం (Dengue fever) బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని నటి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న రెండు ఫొటోలను షేర్ చేశారు. గత కొన్ని రోజులుగా తాను, తన కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు జాగ్రత్తగా ఉండండి అంటూ ఫ్యాన్స్‌కు సూచించారు.
గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయని చెప్పారు. దాని కారణంగా డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మస్కిటో కిల్లర్ వంటి వాటిని (Mosquito repellents) తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. అదే సమయంలో ఇమ్యూనిటీని కూడా పెంచుకోవాలని చెప్పారు. ప్రస్తుతం నటి పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read..
Akhilesh Yadav | అలాజరిగుంటే టీమ్ఇండియా ప్రపంచకప్ గెలిచేది : అఖిలేశ్ యాదవ్