శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ట్రైలర్‌ను యువ హీరో విశ్వక్సేన్ ఆవిష్కరించారు. ‘ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు సమీపంలో మునుపెన్నడూ చూడని దారుణ హత్య జరిగింది. ఆ హత్యలను దిష్టిబొమ్మ హత్యలుగా పోలీసులు పేర్కొన్నారు’ అనే న్యూస్ బులెటిన్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఎలాంటి క్లూ వదలకుండా హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ ఎలా పరిష్కరించాడన్నదే కథాంశమని, అనేక మలుపులతో సాగుతుందని దర్శకుడు తెలిపారు.
పురాణాలతో ముడిపడిన ఎలిమెంట్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయని హీరో శివ కందుకూరి తెలిపారు. విభిన్నమైన థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుందని నిర్మాతలు పేర్కొన్నారు. రాశిసింగ్ అరుణ్‌కుమార్, దేవిప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివకుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: గౌతమ్ జార్జ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్, నిర్మాతలు: స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై, దర్శకత్వం: పురుషోత్తం రాజ్.