Bhola Shankar | ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న భోళా శంకర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Bhola Shankar | చిరు కెరీర్లో తొలిసారి జీరో షేర్ అనే మాట వినాల్సి వచ్చిందంటే అది భోళా శంకర్ సినిమాతోనే. ఈ సినిమా కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. మెగా అభిమానులు దీన్నొక పీడకలలా వర్ణిస్తుంటారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అందులో పావు వంతు కలెక్షన్లు కూడా తెచ్చిపెట్టలేకపోయింది.
Bhola Shankar | చిరు కెరీర్లో తొలిసారి జీరో షేర్ అనే మాట వినాల్సి వచ్చిందంటే అది భోళా శంకర్ సినిమాతోనే. ఈ సినిమా కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. మెగా అభిమానులు దీన్నొక పీడకలలా వర్ణిస్తుంటారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అందులో పావు వంతు కలెక్షన్లు కూడా తెచ్చిపెట్టలేకపోయింది. మెహర్ రమేష్ ఇంకా పాత చింతకాయ పచ్చడి విధానంలోనే సినిమాలను చేస్తున్నాడని ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇలాంటి సినిమాను చిరు సైతం ఎలా చేశాడంటూ పలువురు ఫ్యాన్స్ కూడా తీవ్రంగా నిరాశ పడ్డారు. ఆచార్యనే అనుకుంటే మెగాస్టార్‌కు భోళా శంకర్ అంతకంటే పెద్ద డిజాస్టర్‌నే మిగిల్చింది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను లాక్ చేసుకుంది. సెప్టెంబర్ 15 అంటే రానున్న శుక్రవారం నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. నిజానికి ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే జనాల్లో పెద్దగా అంచనాల్లేవు. చిరు ఫ్యాన్స్ సైతం ఇది కూడా పోతుందని ముందుగానే ఫిక్సయిపోయారు. అయితే కథలో మాస్ హంగులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఓ మోస్తరు విజయమైనా సాధిస్తుందని అనుకున్నారు. కానీ మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ తలకిందులయ్యాయి.
మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కింది. చిరుకు జోడీగా తమన్నా నటించగా.. కీర్తి సురేష్ చెల్లెలి రోల్ చేసింది. సుశాంత్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

