Bhola shankar Movie Fisrt Single | వాల్తేరు వీరయ్యతో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చిన చిరు.. ప్రస్తుతం అదే జోష్ తో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు మంచి అంచనాలే క్రియేట్ చేశాయి. ఈ సినిమాను అగస్టు 11న రిలీజ్ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో చిత్రబృందం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తు్ంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను ఆదివారం రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. కాగా తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజయ్యే టైమ్ ను చిత్రబృందం వెల్లడించింది.
భోళా మేనియా అంటూ సాగే మాస్ బీట్ సాంగ్ ను సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మహతి స్వర సాగర్ స్వర పరిచిన ఈ పాటను రామ జోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించాడు. ఇప్పటికే రిలీజైన ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని మెగా ఫ్యాన్స్ వేయిట్ చేస్తున్నారు. ఏకే ఎంటర్టైనమెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్ గా తెరకెక్కుతుంది.
The #BholaaMania begins with a Mega Swag Promo 😎
Full Lyrical Releasing Today @ 4:05 PM💥
MEGA🌟@KChiruTweets as #BholaaShankar 🔱 in @MeherRamesh‘s Stylish Mass Presentation🔥@SagarMahati thumping musical🥁@AnilSunkara1 @dudlyraj @ramjowrites pic.twitter.com/iAmZHzUmbf
— Aditya Music (@adityamusic) June 4, 2023
ఇక మెహర్ రమేష్ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాతో మెగాఫోన్ పట్టాడు. 2013లో వచ్చిన షాడో తర్వాత ఇప్పటివరకు ఆయన మరో సినిమా చేయలేదు. దాంతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టాడట. ఎలాగైన చిరుకు అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇవ్వాలని తెగ ప్రయత్నం చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరుకు చెల్లెలుగా కనిపించనుంది.