Bhola Shankar | టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం భోళా శంకర్ (Bhola Shankar)తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. మెహర్‌రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. చిరంజీవి సోదరిగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ నటిస్తోంది. ఇటీవలే భోళామేనియా సాంగ్ విడుదల చేశారు మేకర్స్. తాజాగా మరో సాంగ్ అప్డేట్ వచ్చేసింది.
హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్లో తమన్నా, చిరు, కీర్తిసురేశ్ కాంబోలో వచ్చే ఎనర్జిటిక్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారని ఇన్సైడ్ టాక్. శేఖర్ వీజే ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేస్తున్నాడు. వేదాళమ్ రీమేక్‌గా వస్తున్న భోళా శంకర్ ఇటీవలే కోల్‌కతాలోని అందమైన లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంది. దీనికి సంబంధించిన స్టిల్స్ కొన్ని ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. స్విట్జర్లాండ్‌లో తమన్నా, చిరుపై వచ్చే సాంగ్ కూడా షూట్ చేశారు.
భోళా శంకర్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. భోళా శంకర్ లో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ రవి శంకర్, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.