Bhogi | టాలీవుడ్ నటుడు శర్వానంద్ కథానాయకుడిగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ (Bhogi). ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుడగా తాజాగా ఈ సినిమా నుంచి కథానాయిక అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో అనుపమ కందుల సులోచనా రాణి అనే గ్రామీణ యువతిగా కనిపించబోతుంది. చేతిలో క్యారేజీ, మోదుగ ఆకులు పట్టుకుని ఉన్న పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 1960ల నాటి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో ఈ సినిమా సాగబోతున్నట్లు సమాచారం.
సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ హై-వోల్టేజ్ డ్రామాలో శర్వానంద్ ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండగా, అనుపమ పరమేశ్వరన్ మరియు డింపుల్ హయాతీ ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 28, 2026 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Anupama Parameswaran