చేతన్‌చేను కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీష్మపర్వం’ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పీఎంకే ఇంటర్నేషనల్, చేతన్ చేను ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రేమ్‌కుమార్ దర్శకుడు. రోషిని సహోత కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్లాప్‌నిచ్చారు.
ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘పీరియాడిక్ డ్రామా కథాంశమిది. కాళీ మాత సెట్లో భారీ యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించబోతున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఈశ్వర్ ఆదిత్య, సంగీతం: విష్ణువిహారి, నిర్మాతలు: ప్రేమ్‌కుమార్, చేతన్ చేను, దర్శకత్వం: ప్రేమ్ కుమార్.