Bheemlanayak | గత వారంరోజుల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాపిక్ ‘భీమ్లానాయక్’. ఈ చిత్రంపై ప్రేక్షకులలో విపరీతంగా అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ గ్లింప్స్, పాటలు ఇలా ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఫిబ్రవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్లో గ్రాండ్‌గా జరుగనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు అతిథిలుగా రానున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. 2 నిమిషాల 14 సెకన్ల నిడివి గల భీమ్లానాయక్ ట్రైలర్ 8.10 గంటలకు విడుదలకానుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు స్క్రీన్‌ప్లే అందించాడు. సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో నిత్యామీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు.