‘రీసౌండింగ్ బ్లాక్ బ్లాస్టర్ హిట్టు కొడతాం..‘ఆరు నెలల క్రితం సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) అధినేత నాగవంశి (Naga vamsi) బల్ల గుద్ది చెప్పిన మాట ఇది. అనుకున్నట్టుగానే భీమ్లానాయక్ (Bheemla Nayak) రీసౌండ్ థియేటర్లలో, బయట భారీగానే వినిపిస్తోంది. భీమ్లానాయక్ సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తున్న నేపథ్యంలో పవర్ ఫుల్ బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ జరుపుకుంది టీం.
డైరెక్టర్ సాగర్ కే చంద్ర, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత నాగవంశి, హీరోయిన్ సంయుక్తామీనన్ అండ్ టీం స్పెషల్ కేక్‌ను కట్ చేసి..టపాసులు పేల్చారు. మేం చెప్పినట్టుగా..ఆ పదాన్ని గుర్తుచేసుకుంటూ ఈ సారి గట్టిగా కొట్టాం. తిరిగిచ్చే సమయం..సితార వంశి ట్వీట్ చేశాడు. పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటించగా…డానియల్ శేఖర్ పాత్రలో రానా నటించాడు. కోలీవుడ్ భామ నిత్యమీనన్, మాలీవుడ్ భామ సంయుక్తామీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించారు
It's time for POWERFUL BLOCKBUSTER Celebrations of #BheemlaNayak !🌪️💥#BlockBusterBheemlaNayak🔥 #BheemlaNayakDay 🤩@PawanKalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @vamsi84 @adityamusic @SitharaEnts pic.twitter.com/hN7dNEBokM
— #BheemlaNayakDay (@SitharaEnts) February 25, 2022
మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కొషియుమ్కు రీమేక్‌గా భీమ్లా నాయక్ ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. మురళీ శర్మ, రావు రమేశ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.