గాయత్రి గుప్తా, గణేష్‌రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్‌బాబు ధూళిపూడి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘భవానీ వార్డ్ 1997’. జీడీ నరసింహా స్వీయ దర్శకత్వంలో చంద్రకాంత్ సోలంకితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 7న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
హారర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో నటించడం పట్ల నటీనటులందరూ ఆనందం వెలిబుచ్చారు. ఉత్కంఠను రేకెత్తించే ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ కొత్తగా ఉంటుందని కెమెరామెన్ అరవింద్ తెలిపారు. హారర్ చిత్రాలకు ఆర్ఆర్ ఇవ్వడం కత్తిమీద సాము లాంటిదని, ఈ సినిమాకు అద్భుతమైన ఆర్ఆర్ కుదిరిందని మ్యూజిక్ డైరెక్టర్ నిస్సి జస్టిస్ చెప్పారు.