Bhartha Mahasayulaku Wignyapthi | సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుంచి భారీ చిత్రాల పోటీ ఉన్నప్పటికీ మాస్ మహారాజా రవితేజ తన మార్క్ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వింటేజ్ రవితేజను గుర్తుచేస్తుందన్న ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అంచనాలను అందుకుందా? ఈ పండగకు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా? సోషల్ మీడియాలో అభిమానులు ఈ సినిమాపై ఎలా స్పందించారు అనేది ఒకసారి చూద్దాం.
ఈ చిత్రంలో రవితేజ పాత్ర చాలా సరదాగా సాగుతుందని తెలుస్తుంది. భార్యగా డింపుల్, ప్రేయసిగా ఆషికా మధ్య ఆయన చిక్కుకున్న తీరు ఆకట్టుకుంటుంది. సంసారంలో వచ్చే అపోహలను హాస్యంతో మిళితం చేసి చూపించిన విధానం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఇక చాలా కాలం తర్వాత రవితేజ తన పాత కామెడీ టైమింగ్‌తో రెచ్చిపోయినట్లు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఆయన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. సినిమా మొదటి భాగం మొత్తం నవ్వులతో సాగిపోతుంది. ముఖ్యంగా రవితేజ, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సీన్లు హైలైట్‌గా నిలిచాయి. భీమ్స్ సిసిరోలియో అందించిన మాస్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి. ఇక సాదాసీదాగా సాగుతున్న కథను మలుపు తిప్పే ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఈ కథలో పెద్దగా కొత్తదనం కనిపించదు. కొన్ని చోట్ల గతంలో వచ్చిన సినిమాల ఛాయలు కనిపిస్తాయి.సెకండ్ హాఫ్‌లో కొన్ని ఎమోషనల్ సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి. ముగింపు ఇంకాస్త బలంగా ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేదన్నది నెటిజన్ల అభిప్రాయం.
చివరిగా నెటిజన్ల కామెంట్లను బట్టి చూస్తే.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెలుస్తుంది. ఇందులో లాజిక్కుల కంటే మ్యాజిక్ ఎక్కువగా ఉంది. రవితేజ ఎనర్జీ కోసం పండగ పూట కాసేపు సరదాగా నవ్వుకోవడానికి ఈ సినిమా ఒక మంచి ఛాయిస్. రవితేజ అభిమానులు మాత్రం మాస్ రాజా ఈజ్ బ్యాక్ అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సంక్రాతికి రెండు సినిమాలు వచ్చి హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుండగా.. తాజాగా రవితేజ చిత్రం కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
#BMW has to be our first film with unanimous positive talk right from premieres 🔥
Inkenduku waiting, book your tickets! 🥁#BharthaMahasayulakuWignnyapthi pic.twitter.com/H9GhPZSufT
— Trends Raviteja™ (@trends4raviteja) January 13, 2026
1st half done
⚠️Regular stry
Too much better than before 2 releases #BharthaMahasayulakuWignnyapthi https://t.co/gUegY1JPV3— Arjun (@arjunn4005) January 12, 2026
#BharthaMahasayulakuWignnyapthi first is hilarious 🤣. @RaviTeja_offl is back to his comic sense. Second half will be crucial.
— saisrikar sharma (@saisrikardhava1) January 12, 2026