ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత రామ్ పోతినేని తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో బైలింగ్యువల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొద్ది రోజుల క్రితం సెట్స్ పైకి వెళ్లగా మూవీ సెట్లో పలువురు సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. రీసెంట్గా దర్శకుడు శంకర్..రాపో 19 సెట్లో సందడి చేయగా, ఇప్పుడు దర్శకుడు భారతీరాజా సెట్లో సందడి చేశారు.
శనివారం భారతీ రాజా బర్త్డే సందర్భంగా రాపో 19 సెట్లో ఆయన 78వ బర్త్డే వేడుకలని జరిపించారు. ‘దర్శకుడు ఇమామ్’ గా ప్రసిద్ధి చెందిన దర్శకుడు భారతీరాజా మూవీ రషెస్ చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నెల మొదటి వారం నుండి ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. యూటర్న్ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందబోతోంది. ఈ సినిమా కథ పూర్తిగా ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి ఎంపికైన సంగతి తెలిసిందే.
🎥 Moments of Legendary Director @offBharathiraja birthday celebrations in the sets of #RAPO19
— BA Raju's Team (@baraju_SuperHit) July 17, 2021
Ustaad @ramsayz @dirlingusamy @IamKrithiShetty @ThisIsDSP @SS_Screens @sujithvasudev @srinivasaaoffl @NavinNooli @anbariv pic.twitter.com/jIcEVRN3cB