Bharani | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కొత్త ట్విస్ట్‌తో ఆడియన్స్‌కి షాక్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌లో భరణి, శ్రీజ లకు రీ-ఎంట్రీ అవకాశం ఇచ్చారు. ఈ నిర్ణయం ఆడియన్స్‌కి సర్ప్రైజ్గా మారింది. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని భావించిన వీరిద్దరికీ మళ్లీ హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం ఇచ్చిన బిగ్ బాస్, “వారిలో ఎవరు కొనసాగాలో మాత్రం ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే నిర్ణయిస్తాం” అంటూ క్లారిటీ ఇచ్చాడు. రీ-ఎంట్రీ తర్వాత జరిగిన నాలుగు టాస్కుల్లో రెండు భరణి, ఒకటి శ్రీజ గెలుచుకోగా, ఒక టాస్క్ క్యాన్సిల్ అయింది. చివరికి ఆడియన్స్ ఓటింగ్‌లో భరణి కే మద్దతు లభించడంతో, ఆయన మళ్లీ హౌస్‌లో పర్మినెంట్ కంటెస్టెంట్‌గా కొనసాగుతున్నారు. శ్రీజ మరోసారి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.
రీ-ఎంట్రీ తర్వాత భరణికి మొదటి పెద్ద టాస్క్‌గా కెప్టెన్సీ డిసిషన్ వచ్చేసింది. తనతో పాటు తనూజ, దివ్య, సాయి, నిఖిల్ పేర్లు సూచించిన భరణి, చివరికి జరిగిన పోటీలో దివ్య కెప్టెన్‌గా ఎంపిక అయ్యింది. అయితే లాస్ట్ రౌండ్లో దివ్య, తనూజ మధ్య కాంపిటీషన్ జరుగుతుండగా భరణి ఎవరి పక్షాన ఉండకుండా సైలెంట్‌గా నిలబడ్డాడు. దీంతో “స్ట్రాంగ్ కంటెస్టెంట్”గా చెప్పబడిన భరణి మళ్లీ “క్లారిటీ లేని గేమ్” ఆడుతున్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. సీజన్ ప్రారంభంలో స్ట్రాంగ్ ప్లేయర్‌గా కనిపించిన భరణి ఇప్పుడు తనూజ, దివ్య ల బాండింగ్‌లో పూర్తిగా ఇరుక్కుపోయాడు. ఈ ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేయాలో, ఎవరి పక్షాన ఉండాలో తెలియక భరణి నిశ్శబ్దంగా ఉంటుండటం గేమ్‌పై ప్రభావం చూపిస్తోంది.
తనూజ కెప్టెన్ కాలేకపోయినందుకు బాధపడుతున్నప్పుడు భరణి, “ఇద్దరు వ్యక్తులు తప్పుగా సలహా ఇస్తున్నారు” అంటూ మాధురి, రీతుల పేర్లు ప్రస్తావించాడు. అయితే ఈ విషయం నేరుగా తనూజకి చెప్పకుండా, ఇమ్మాన్యుయేల్ తో మాట్లాడటం భరణి గేమ్‌పై ఆడియన్స్‌లో మిక్స్డ్ రియాక్షన్స్ తెచ్చింది. ఫిజికల్ టాస్క్‌ల్లో భరణి పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోతున్నాడు. ఆరోగ్య సమస్యలు కారణమని చెబుతున్నా, ఆడియన్స్ దృష్టిలో ఇది నెగెటివ్ ఇంప్రెషన్ కలిగిస్తోంది. రీ ఎంట్రీ అనే పెద్ద అవకాశాన్ని సరైన విధంగా ఉపయోగించుకోలేకపోతున్నాడని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మరోసారి నామినేషన్స్‌లో భరణి పేరు వస్తే ఈసారి సేఫ్‌గా బయటపడతాడా లేదా మళ్లీ ఎలిమినేట్ అవుతాడా అన్నది చూడాలి. కానీ చివరి వారం వరకు నిలవాలంటే భరణి ఇప్పుడు సేఫ్ గేమ్ కాకుండా క్లియర్ స్టాండ్ తీసుకుని, దాని మీద ఫైట్ చేయాల్సిందే అని ఆడియన్స్ అంటున్నారు.