బిగ్ బాస్ నుంచి తెలుగు ఇండస్ట్రీకి చాలా మంది పరిచయం అవుతున్నారు. అంతకు ముందు వాళ్లెవరో కూడా ప్రేక్షకులకు తెలిసుండదు కానీ బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ రేంజ్ మారిపోతుంది. అలా ఆ షో నుంచి తెలుగు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన ముద్దుగుమ్మ భాను శ్రీ. ఇంకా చెప్పాలంటే ఈమె ఇంటి పేరు బిగ్ బాస్ అయిపోయింది. కౌశల్ విజేతగా నిలిచిన రెండో సీజన్ లో వచ్చింది ఈ రెడ్డి గారమ్మాయి. అక్కడ కావాల్సినంత గ్లామర్ షో చేసి అందర్నీ మాయ చేసింది. బయటికి వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు కూడా చేసింది భాను. అయితే అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. మధ్యలో కొన్ని టీవీ షోలకు హోస్టింగ్ కూడా చేసింది.. ఇంకా చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఈటీవీలో వచ్చే చాలా కార్యక్రమాల్లో ఈ బిగ్ బాస్ బ్యూటీ సందడి చేస్తుంది. అక్కడ అందాలను విరివిగా ఆరబోస్తూ అదరహో అనిపిస్తుంది.
అయితే ఎంత చేసినా కూడా ఈమె కోరుకున్న గుర్తింపు మాత్రం రావడం లేదు. అయినా కూడా తగ్గేదే లే అంటుంది భాను. కోరుకున్న బ్రేక్ వచ్చే వరకు కూడా వెనక్కి తగ్గేదే లే అంటూ అదిరిపోయే గ్లామర్ షో చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా విడుదలైన ఫోటోషూట్ కూడా అలాంటిదే. చిన్న గౌను వేసుకుని అందాలను హైలైట్ చేస్తూ.. కొంటె చూపులతో అందర్నీ తినేసేలా చూస్తుంది భాను శ్రీ. ఈ ఫోటోలు చూసిన తర్వాత ఈ తెలుగమ్మాయికి అర్జంటుగా బ్రేక్ ఇచ్చేయాలేమో అనేంతగా రెచ్చిపోయింది. ఇప్పటికే రెండు మూడు సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది భాను. అలాగే మరికొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఏదేమైనా కూడా తనకు బ్రేక్ వచ్చే వరకు ఇలాగే రెచ్చిపోవాలని డిసైడ్ అయిపోయింది ఈ భామ.