Bhanu Shree Mehra | వరుడు (Varudu) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది పంజాబీ సోయగం భాను శ్రీ మెహ్రా (Bhanu Shree Mehra). ఈ సినిమాలో అందాలు ఆరబోసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. గతేడాది నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ మిస్ ఇండియాతోపాటు టెన్త్ క్లాస్ డైరీస్‌లో కీలక పాత్ర పోషించింది. ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ బిజీగా ఉండే ఈ భామ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులేమీ లేకపోవడంతో వెకేషన్ టూర్ ప్లాన్ చేసింది.
వియత్నాం (Vietnam) హోయ్ యన్ సిటీలోని అందమైన లొకేషన్లలో చక్కర్లు కొడుతోంది. సిటీలోని బార్లలో ఛిల్ అవుతోంది. మరోవైపు బీచ్‌లో బికినీ వేర్లో షికారు చేస్తూ.. సంతోషకర క్షణాలను కెమెరాలో బంధించింది. ఛిల్ వైబ్స్, ప్రైవేట్ బీచ్, సముద్రం తీరాన మ్యూజికల్ ఈవెంట్లను మిస్ అవ్వకండి.. అంటోంది. తన ట్రావెల్ మ్యాగజైన్స్ స్టోరీలను రీల్స్‌గా పోస్ట్ చేస్తూ.. ఆ ప్రాంత విశేషాలను అందరితో పంచుకుంది.
వియత్నాంలోని రుచికరమైన శాఖాహారాన్ని ఆస్వాదించేందుకు ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. వియత్నాంలో శాఖాహారం దొరకడం కష్టమనేది అపోహ. నన్ను నమ్మండి.. మీరు దేశంలో ఎక్కడికి వెళ్లినా నోరూరించే ఫుడ్ పుష్కలంగా అందుబాటులో ఉంది.. అంటూ విశేషాలను పంచుకుంది. ప్రస్తుతం 95.4K ఫాలోవర్లు ఉన్న భాను శ్రీ మెహ్రాకు రాబోయే కాలంలో ఫాలోయింగ్ పెరగడం ఖాయమని తాజా ఫొటోలు, వీడియోలు చెబుతున్నాయి.
బీచ్‌లో భాను శ్రీ మెహ్రా షికారు ఇలా..