‘ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కథలో చాలామంచి ఎమోషన్స్ ఉంటాయి. దర్శకుడు శివసాయి నేను పనిచేసిన దర్శకుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్. తాను ఈ సినిమాను మలచిన తీరు అద్భుతం. దర్శకుడి విజన్‌కి తగ్గట్టు నిర్మాత కూడా సహకరించడం వల్లే సినిమా బాగా వచ్చింది. కథానాయిక మనీషా కంద్కూర్ చక్కగా పెర్ఫార్మ్ చేసింది. శేఖర్‌చంద్ర బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు.
మారుతీగారితో ఎప్పట్నుంచో పనిచేయాలని ఉండేది. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది.’ అని రాజ్ తరుణ్ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘భలే ఉన్నాడే’. జె.శివసాయివర్ధన్ దర్శకుడు. ఎన్వీ కిరణ్‌కుమార్ నిర్మాత. అగ్రనిర్మాత మారుతి సమర్పకుడు. సెప్టెంబర్ 7న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజ్‌తరుణ్ మాట్లాడారు. ‘అమ్మాయిలకు చీరకట్టే వాళ్లను శారీ డ్రాపర్స్ అంటారు. ఇందులో రాజ్‌తరుణ్ శారీ డ్రాపర్‌గా నటించారు. అమ్మాయిలకి చీరకట్టాలంటే ఓ కంఫర్ట్బుల్ లెవల్ ఉండాలి.
దాని ప్రకారం రాజ్‌తరుణ్ లుక్‌నీ, బిహేవియర్‌ని డిజైన్ చేశా. తను ఎందుకలా ఉన్నాడనేది సెప్టెంబర్ 7న తెరపై చూస్తారు.’ అని దర్శకుడు చెప్పారు. ఇంకా కథానాయిక మనీషా కంద్కూర్, నిర్మాత కిరణ్‌కుమార్, సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర కూడా మాట్లాడారు.