‘నేను చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తు పెరిగాను.క్రైమ్ కామెడీ తరహా చిత్రాలు తెలుగులో చాలా తక్కువగా చేసినట్లు అనిపించింది. అందుకే ఈ జోనర్లో సినిమా చేయాలని అనుకుని నిర్మించిన చిత్రమే ‘భాగ్సాలే’ అన్నారు నిర్మాత అర్జున్ దాస్యన్. యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమలతో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘భాగ్సాలే’. ఈ నెల 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా అర్జున్ దాస్యన్ మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ‘క్రైమ్ కామెడీ జోనర్ కాస్త సేఫ్ జోనర్లా అనిపించింది. దర్శకుడు ప్రణీత్ కథ చెప్పినప్పుడు ఆయన చెప్పింది తీయగలుగుతాడా లేదా అని భయమేసింది. మొదటి కాపీ చూసిన తరువాత నేను అనుకున్న దానికంటే పదిరెట్లు ఎక్కువగా తీశాడని నమ్మకం కలిగింది. హీరో శ్రీసింహాకు ఈ జోనర్ బాగా సెట్ అవుతుంది.
ఈ జోనర్లో వచ్చిన ‘మత్తువదలరా’ కూడామంచి విజయం సాధించింది. ఈ సినిమా కూడా కమర్షియల్గా అంతకు మించిన హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాలో రింగ్ ఓ ఇంపార్టెట్ రోల్ ప్లే చేస్తుంది. అదెంటో సినిమా చూస్తే తెలుస్తుంది. అర్జున్ పాత్రలో శ్రీసింహా నటన అందరిని మెప్పిస్తుంది. కాలభైరవ సంగీతం చిత్రానికి చాలా ప్లస్ అయ్యింది’ అన్నారు.