Ashok.G | కొత్త సినిమాను ప్రకటించిన భాగమతి డైరెక్టర్.. ఈ సారి మరింత థ్రిల్లింగ్‌గా..!
Director Ashok | 'పిల్ల జమిందార్' సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు అశోక్. కామెడీని అద్భుతంగా పండించి నాని కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా చెప్పుకునేలా చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో అశోక్ నుంచి సినిమాలు రాలేవు.
Director Ashok | ‘పిల్ల జమిందార్’ సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు అశోక్. కామెడీని అద్భుతంగా పండించి నాని కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా చెప్పుకునేలా చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో అశోక్ నుంచి సినిమాలు రాలేవు. ఈ క్రమంలో తన కంఫర్ట్ జానర్ నుంచి వచ్చేసి ఐదేళ్ల కిందట ‘భాగమతి’ వంటి హార్రర్ డ్రామాను తెరకెక్కించాడు. అప్పటికి ఫుల్ ఫామ్‌లో ఉన్న యూవీ సంస్థ ఈ సినిమాను నిర్మించనుండటంతో మళ్లీ ఒక్క సారిగా అశోక్ పేరు మార్మోగిపోయింది. పైగా అరుంధతి వంటి ఎపిక్ తర్వాత అదే జానర్లో అనుష్క సినిమా చేయనుండంతో అందరిలోనూ తిరుగులేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే సినిమా రిలీజయ్యాక ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. కమర్షియల్‌గా కోట్లు కొల్లగొట్టినా.. అనుష్క అభిమానులకు మాత్రం ఫుల్ మీల్స్ పెట్టలేకపోయింది. ఇక ఇదే సినిమాను మూడేళ్ల కిందట భూమి పడ్నేఖర్ను పెట్టి దుర్గమతి పేరుతో హిందీలో రీమేక్ చేశాడు. నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు అంతగా ఆధరణ దక్కలేదు. దాంతో అశోక్ మళ్లీ మెగాఫోన్ పట్టినట్లు జాడే కనిపించలేదు. కాగా మూడేళ్ల తర్వాత అశోక్ తన కొత్త సినిమాను ప్రకటించాడు.
హవీష్ లక్ష్మణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ అశోక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఛూ మంతర్ కాళి అనే డిఫరెంట్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ తాజాగా విడుదలైంది. హీరో హ్యాట్ పెట్టుకుని బ్లాక్ అవుట్ ఫిట్ లుక్‌లో దర్శనమిచ్చాడు. ఇక పోస్టర్లో ది స్కేరియెస్ట్ బుక్ అని కూడా మెన్షన్ చేశారు. దాంతో ఈ బుక్ నేపథ్యంలోనే సినిమా ఉండబోతుందని క్లియర్‌గా స్పష్టమైంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు.
#ChuMantarKaali – The Scariest Book,
Hero @idhavish‘s Next unveiled with an Intriguing First Look & Title Unveil poster celebrating his birthday 💥📣From #GAshok – Director of Bhaagamathie 🎬
Produced by #KStudios
Stay tuned for more details.#HBDHavish pic.twitter.com/cX42Y53Z3R
— Vamsi Kaka (@vamsikaka) June 25, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

