శ్రీసింహా హీరోగా నటిస్తున్న చిత్రం ‘భాగ్ సాలే’. ప్రణీత్‌సాయి దర్శకుడు. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మాతలు. ఈ చిత్రంలోని ‘ప్రేమ కోసం’ అనే మాస్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. నిర్మాతలు మాట్లాడుతూ ‘నేటి తరం ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిది.
కాలభైరవ స్వరకల్పనలో కాసర్య శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, మంగ్లీ ఆలపించిన ఓ మాస్ సాంగ్‌ను విడుదల చేశాం. ఈ పాట చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు.