Raj Dasi reddy | మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన “భద్రం బి కేర్ ఫుల్” చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజ్ దాసిరెడ్డి, ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ ఫ్యాషన్ హౌస్ “లూయిస్ వ్యూట్టన్” (Louis Vuitton) హైదరాబాద్ స్టోర్‌లో సందడి చేశారు. హ్యాండ్ బ్యాగ్స్, షూస్, జ్యువెలరీ మరియు లైఫ్‌స్టైల్ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఎంతో పేరుగాంచిన ఈ ప్రతిష్ఠాత్మక బ్రాండ్ స్టోర్‌ను సందర్శించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
దాదాపు 172 సంవత్సరాల సుదీర్ఘ ఘన చరిత్ర కలిగిన లూయిస్ వ్యూట్టన్, ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఫ్యాషన్ బ్రాండ్‌గా ఎన్నోసార్లు అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గ్లోబల్ సెలబ్రిటీలు సైతం ఎంతో గర్వంగా, ప్రత్యేకంగా భావించే ఈ బ్రాండ్ ఉత్పత్తులను రాజ్ దాసిరెడ్డి ఆసక్తిగా పరిశీలించారు. ఇదిలా ఉండగా, రాజ్ దాసిరెడ్డి త్వరలోనే తన తదుపరి కొత్త చిత్రాన్ని ప్రకటించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం.