Betting Apps Case | బెట్టింగ్ యాప్ వ్యవహారంలో కీలక పరిణామం..! హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై కేసు..!
Betting Apps Case | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తున్నది. ఇప్పటికే పలువురు నటీనటులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. తాజాగా సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై కేసులు నమోదయ్యాయి.
Betting Apps Case | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తున్నది. ఇప్పటికే పలువురు నటీనటులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. తాజాగా సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై కేసులు నమోదయ్యాయి. ఇమ్మాని రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నటులు బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసినట్లుగా ఆరోపించారు. ఓ టాక్ షోలో పాల్గొన్న సమయంలో అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నిర్వహించినట్లు ఆయన ఆరోపించారు. టాక్‌లో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించగా.. స్పెషల్ ఎపిసోడ్లో ప్రభాస్, గోపీచంద్ కనిపించారు.
సదరు ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.80లక్షలు కోల్పోయానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫన్88 అనే బెట్టింగ్ యాప్‌కి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ఆ హీరోలు ప్రమోటింగ్ చేయడంతోనే తాను ఆ బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టి నష్టపోయినట్లు పేర్కొన్నారు. యాప్ యాక్సెన్‌ను నిలిపివేయాలని పోలీసులను కోరారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో టాలీవుడ్ ప్రముఖులు రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అలాగే, యాంకర్స్, యూ ట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేసిన పలువురిని విచారించిన విషయం తెలిసిందే. తాజాగా ముగ్గురు స్టార్ హీరోలపై కేసు నమోదు కావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

