Manchu Lakshmi | బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించిన బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఇటీవల ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ (ED) టాలీవుడ్లో పలువురు నటులకు సమాన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్‌తో పాటు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ తదితరులు విచారణకు హాజరయ్యారు. తాజాగా మంచు లక్ష్మీ కూడా నేడు బాషీర్భాగ్లో ఉన్న ఈడీ కార్యాలయానికి వెళ్లింది. బెట్టింగ్ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై ఈడీ లక్ష్మిని విచారించబోతున్నట్లు సమాచారం.