Actor Darshan | రేణుకస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించారు. నటుడు దాఖలు చేసిన పిటిషన్‌పై బెంగళూరు ట్రయల్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చిన దర్శన్ జూన్ ఒకటి నుంచి 25 వరకు దుబాయి, యూరప్‌కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అభిమాని రేణుకస్వామి హత్య కేసులో ఏ-2గా ఉన్న విషయం తెలిసిందే. కేసులో మొత్తం నటి పవిత్రగౌడతో సహా మరో 15 మంది ప్రేమయం ఉందని ఆరోపణలున్నాయి. అయితే, దర్శన్‌కు విదేశాలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తే.. మళ్లీ తిరిగి రాకపోవచ్చని.. విచారణ ప్రక్రియ పట్టాలు తప్పించే ప్రమాదం ఉందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు.
దర్శన్ బెయిల్‌పై బయటకు వచ్చాక ‘డెవిల్’ చిత్రం షూటింగ్లో పాల్గొన్నారు. మొదట బెంగళూరు వరకే ప్రయాణించేందుకు అనుమతి ఉండగా.. తర్వాత షూటింగ్ కోసం భారత్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. తాజాగా ఆయన విదేశీ పర్యటన కోసం కోర్టును ఆశ్రయించారు. చిత్రదర్శకు చెందిన అభిమాని రేణుకస్వామిని కిడ్నాప్ చేసి హత్య చేశాడన్న ఆరోపణలపై దర్శన్, పవిత్రగౌడతో పాటు పలువురిని గతేడాది జూన్ 11న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో దర్శన్‌కు బెయిల్ లభించగా.. డిసెంబర్లో పవిత్ర గౌడతో పాటు మరికొందరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.