Bellamkonda Sreenivas Next Movie | ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లో తిరుగులేని డెబ్యూ ఇవ్వాలనుకున్న సాయి శ్రీనివాస్ కల.. కలగానే మిగిలిపోయింది. ఎన్నో వాయిదాల తర్వాత నెల రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా తొలిరోజే నెగెటీవ్ టాక్ తెచ్చుకుని ఘోర పరాజయం పాలైంది. మూడేళ్లు ఒళ్లు హూనం చేసుకుని కష్టపడ్డ సాయి శ్రీనివాస్ ను ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. ఇక బాలీవుడ్ లో సెట్ కాదని భావించి లేట్ చేయకుండా టాలీవుడ్ లో సినిమాకు ముస్తాబవుతున్న బెల్లంకొండ. ప్రస్తుతం ఆయన సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇక భీమ్లానాయక్ తర్వాత సాగర్ కే చంద్ర చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి హైపే నెలకొంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ ముచ్చటగా మూడో సారి ఖాకీ చొక్కా తొడుక్కోబోతున్నాడని సమాచారం. గతంలో కవచం, రాక్షసుడు సినిమాలు చేశాడు. కవచం కమర్షియల్ ఫేయిల్యూర్ గా మిగిలగా.. రాక్షసుడు హిట్టయింది. ఇక ఇప్పుడు మూడో సారి పోలీస్ కథతో వస్తున్నాడు. అయితే ఈ సారి మరీ అంత సీరియస్ పోలీస్ పాత్రలో కాకుండా కావాల్సినంత ఎంటర్టైనమెంట్ ఇచ్చే పోలీస్ పాత్రలో కనిపించనున్నాడట. నిజానికి బెల్లంకొండ కటౌట్ కు పోలీస్ క్యారెక్టర్ బాగా సెట్ అవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం చిత్రబృందం హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నారట. శ్రీలీలను మొదటగా అనుకున్నా.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ఒప్పుకోలేదని సమాచారం.