Bellamkonda Sreenivas | హైదరాబాద్‌కు మకాం మార్చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. అందుకేనట..!
Bellamkonda Sreenivas | టాలీవుడ్ యాక్టర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) ఈ ఏడాది ఛత్రపతి హిందీ రీమేక్‌తో బాలీవుడ్(Bollywood) ఎంట్రీ ఇచ్చాడని తెలిసిందే. ఛత్రపతి (Chatrapathi) మే 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాగా.. ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. తాజాగా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
Bellamkonda Sreenivas | తెలుగులో సినిమాలు చేస్తూ.. ఇక్కడి కన్నా నార్తిండియాలో ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas). అల్లుడు శీను సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన ఈ యంగ్ యాక్టర్ ఈ ఏడాది ఛత్రపతి హిందీ రీమేక్‌తో బాలీవుడ్(Bollywood) ఎంట్రీ ఇచ్చాడని తెలిసిందే. వివి వినాయక్ (VV Vinayak) దర్శకత్వం వహించిన ఛత్రపతి (Chatrapathi) మే 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాగా.. ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది.
అయితే బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు యూట్యూబ్‌లో సూపర్ క్రేజ్ ఉంటుంది. వీటితో నార్తిండియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఛత్రపతి సినిమాతో అక్కడ ఫుల్ టైం యాక్టర్‌గా పాగా వేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీపై ఫోకస్ పెట్టేందుకు ముంబైకి మకాం మార్చేశాడని అప్పట్లో వార్తలు తెరపైకి వచ్చాయని తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం సీన్ రివర్సైందన్న వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
తాజాగా టాక్ ప్రకారం ముంబైలో పెద్ద ఇంటిని అద్దెకు తీసుకున్న బెల్లంకొండ తన నిర్ణయం మార్చుకున్నాడని, తిరిగి హైదరాబాద్‌కు తన మకాం మార్చేశాడని ఇన్సైడ్ టాక్. ఇక నుంచి టాలీవుడ్ కెరీర్‌పైనే బెల్లంకొండ పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం స్టూవర్ట్‌పురం దొంగ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బెల్లంకొండ. ఛత్రపతి పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.ఛత్రపతిలో బాలీవుడ్ భామ నుస్రత్ బరూచా ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. బాలీవుడ్ లెజెండరీ కమెడియన్ జానీ లివర్ కీ రోల్లో నటించాడు.
పెన్ స్టూడియోస్‌పై బాలీవుడ్ నిర్మాత జయంతి లాల్ గడా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో భాగ్య శ్రీ, శరద్ కేల్కర్, శివమ్ పాటిల్, ఫ్రెడ్డి దారువాలా, రాజేంద్ర గుప్తా, సహిల్ వైద్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తనిష్క్ బాఘ్చీ సంగీతం అందించాడు.
Separated from his family during a conflict, a refugee embarks on a mission to reunite with his adopted family. However, he faces several challenges after his foster brother conspires against him.
Hindi Film #Chatrapathi Now Streaming On Prime Video pic.twitter.com/gnIMBeJfSx
— Cinema World (@cinemaa_world) November 21, 2023
ఛత్రపతి ట్రైలర్..
ఛత్రపతి టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

