Bellamkonda Sreenivas | బాలీవుడ్(Bollywood) లోకి డైరెక్ట్‌గా ఎంట్రీ ఇస్తూ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేకుందుకు రెడీ అయ్యాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas). ఇప్పటికే డబ్బింగ్ వెర్షన్ సినిమాలతో ఉత్తరాదిన మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ కుర్ర హీరో వివి వినాయక్ (V V Vinayak) దర్శకత్వంలో వస్తున్న ఛత్రపతితో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఛత్రపతి మే 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల కాకముందే మరో క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీలో మరో రెండు సినిమాలకు సైన్ చేశాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. తాజా టాక్ ప్రకారం ఛత్రపతిని తెరకెక్కించిన పెన్ స్డూడియోస్ బ్యానర్ బెల్లంకొండతో ఈ రెండు కొత్త చిత్రాలను తెరకెక్కించనుందని బీటౌన్‌లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. సరైన సమయంలో ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ రానున్నాయని టాక్. కాగా ఇందులో ఒక చిత్రం వివి వినాయక్ చేయబోతున్నాడట.
మొత్తానికి ఛత్రపతి విడుదల కాకముందే ఇదే కాంబోలో మరో సినిమా వస్తుందన్న వార్త ఇంట్రెస్టింగ్గా మారింది. ఛత్రపతిలో బాలీవుడ్ లెజెండరీ కమెడియన్ జానీ లివర్ (Johny Lever) కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై బాలీవుడ్ నిర్మాత జయంతి లాల్ గడా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ భామ నుస్రత్ బరూచా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. భాగ్య శ్రీ, శరద్ కేల్కర్, శివమ్ పాటిల్, ఫ్రెడ్డి దారువాలా, రాజేంద్ర గుప్తా, సహిల్ వైద్ ఇతర నటీనటులు కీ రోల్స్ చేస్తున్నారు. తనిష్క్ బాఘ్చీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఛత్రపతి ట్రైలర్..
ఛత్రపతి టీజర్..