Kishkindhapuri | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas), అనుపమ పరమేశ్వరన్(Anupama) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘కిష్కిందపురి’ (Kishkindhapuri). హారర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాకు కౌశిక్ పెగళ్ళపాటి (Koushik Pegallapati ) దర్శకత్వం వహిస్తుండగా.. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి (Sahu Garapati) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇటీవలే ఉండిపోవే నాతోనే (Undipove Naathone) అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయగా.. ఆకట్టుకుంటుంది. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. సువర్ణమాయ రేడియో స్టేషన్.. ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి డైలాగ్స్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా టీజర్ హారర్ థ్రిల్లర్‌తో రాబోతున్నట్లు అర్థమవుతుంది.