HERO | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా భైరవం మూవీ ప్రమోషన్స్‌లో షాకింగ్ కామెంట్ చేశారు. కొంత మంది హీరోలని ఇన్స్పైర్గా తీసుకొని రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకుంటున్నా అని అన్నారు. అలా ఎవరిని ఉద్దేశించి అన్నాడు, ఎందుకు అనాల్సి వచ్చింది అనే దానిపై ఇప్పుడు నెట్టింట జోరుగా చర్చ నడుస్తుంది. భైరవం చిత్రం మే 30న విడుదల కానుండగా, ఈ సినిమా కోసం నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రమోషన్ కార్యక్రమాలలో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. తాజాగా సుమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా, ఆ సమయంలో పెళ్లి ప్రస్తావన తెచ్చింది సుమ. అప్పుడు మనోజ్ మాట్లాడుతూ.. తెల్లారి లేస్తే మరిచిపోతున్నావు తమ్ముడు. రోజు ఒక పెళ్లంటే కష్టం అని అన్నాడు.
అప్పుడు బెల్లంకొండ వెంటనే కొంత మంది హీరోలని ఆదర్శంగా తీసుకొని రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకుంటున్నా అని అన్నాడు. అంటే మనోజ్‌కి కౌంటర్‌గా బెల్లంకొండ ఈ కామెంట్స్ చేశాడా అని ముచ్చటించుకుంటున్నారు. కాగా, మనోజ్ కొద్ది నెలల క్రితం రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పెళ్లి తర్వాత నుండే మోహన్ బాబు ఫ్యామిలీ మనోజ్‌ని దూరం పెట్టినట్టు కూడా ప్రచారం జరిగింది. ఇక భైరవం విషయానికి వస్తే… ఈ చిత్రం తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన గరుడన్ సినిమాకు రీమేక్ గా రూపొందించినట్టు తెలుస్తుంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్లో యాక్షన్ సీక్వెన్సులు హైలైట్‌గా నిలిచాయి.. చివరి షాట్ అయితే నెక్ట్స్ లెవల్లో ఉంది. ఓ గుడి, వాటి ఆస్తుల చుట్టూ తిరిగే గ్రామీణ కథ గా చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు. మంచు మనోజ్‌కు రీ ఎంట్రీ సినిమా కాగా.. అలాగే బెల్లంకొండ, రోహిత్ సైతం చాలా రోజులుగా సక్సెస్ దక్కించుకోలేకపోయారు. ఇక దర్శకుడు విజయ్ కూడా ఉగ్రంతో కమర్షియల్ విజయం అందుకోలేదు.అందుకే వీరిందరికి ఈ చిత్రం విజయం చాలా ముఖ్యం. హిట్ కొడతామనే నమ్మకంతో వారు ఉన్నారు. మరి ప్రజలు ఈ సినిమాని ఎంత హిట్ చేస్తారో చూడాలి.
“కొంత మంది హీరోలని చూసి inspire అయ్యి రెండు మూడు పెళ్ళిళ్ళు చేస్కుందాం అనుకుంటున్నాను” – #BellamkondaSreenivas#Bhairavam pic.twitter.com/e0SIZMwdiG
— Daily Culture (@DailyCultureYT) May 22, 2025