Swathimuthyam | స్వాతి ముత్యం ముందు భారీ లక్ష్యం.. చిరు, నాగ్‌లను తట్టుకుంటాడా..?
Swathimuthyam | చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోల సినిమాలు దసరాకు పోటీ పడుతుంటే .. రేసులో తాను కూడా ఉన్నానంటూ వచ్చేశాడు బెల్లంకొండ గణేశ్. సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ చిన్న కొడుకు ఈయన.
Swathimuthyam | రెండు పొట్టేళ్లు బరిలో ఉన్నపుడు.. మధ్యలో వెళ్తే అవి గుద్ది గుద్ది చంపేస్తాయి. ఆ విషయం తెలిసి కూడా బరిలో దిగాలంటే తనపై తనకు చాలా నమ్మకం ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ నాలో ఉందంటున్నాడు కొత్త హీరో బెల్లంకొండ గణేశ్. చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోల సినిమాలు దసరాకు పోటీ పడుతుంటే .. రేసులో తాను కూడా ఉన్నానంటూ వచ్చేశాడు ఈ కుర్ర హీరో. సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ చిన్న కొడుకు ఈయన. ఇప్పటికే అన్నయ్య శ్రీనివాస్ హీరో అయ్యాడు. ఇప్పుడు తమ్ముడు కూడా ఇండస్ట్రీకి వచ్చేస్తున్నాడు. ఈయన తొలి సినిమా స్వాతిముత్యం అక్టోబర్ 5న దసరా సందర్భంగా విడుదల కానుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వస్తున్న సినిమా కావడంతో సరిపోయేటన్ని థియేటర్స్ దొరికేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా బాగానే చేసుకుంటున్నారు. కొత్త దర్శకుడు లక్ష్మణ్ ఆర్ కృష్ణన్ తెరకెక్కించిన స్వాతి ముత్యం సినిమాలో స్పెర్మ్ డొనేషన్ గురించి చెప్తున్నారు. విక్కీ డోనర్ తరహా సినిమా ఇది. బోల్డ్ కంటెంట్ ఉన్నా.. ఈ పండక్కి కుటుంబం అంతా చూడదగ్గ సినిమా అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగింది. కొత్త హీరో అయినా.. కంటెంట్‌పై నమ్మకంతో స్వాతి ముత్యం సినిమాకు దాదాపు 4.2 కోట్ల బిజినెస్ చేశారు నిర్మాతలు. దీనికి 5 కోట్లు వస్తే సేఫ్ అవుతుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త హీరో సినిమాకు 5 కోట్ల షేర్ రావడం అనేది చిన్న విషయం కాదు.. కానీ కంటెంట్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటే మాత్రం పెద్ద కష్టం కాదు. దానికితోడు చిరు, నాగ్ సినిమాలకు టికెట్స్ దొరక్కపోతే.. మరో ఆప్షన్ కూడా లేదు. కుటుంబ ప్రేక్షకులకు కూడా అనువైన సబ్జెక్ట్ కావడం స్వాతిముత్యం సినిమాకు కలిసొచ్చే విషయం. పండగ సీజన్ కాబట్టి కాస్త బాగున్నా.. పాస్ మార్కులు వేస్తారు ఆడియన్స్ అనే నమ్మకంతోనే వీళ్లు కూడా వస్తున్నారు. మరి వాళ్ల నమ్మకం నిజమై.. చిరంజీవి, నాగార్జునతో పోటీ పడి బెల్లంకొండ గణేశ్ 5 కోట్లు వసూలు చేస్తాడా లేదా అనేది చూడాలిక.
Read More :
“Dussehra Telugu movies 2022 | దసరా చిత్రాలకు బుకింగ్స్ ఓపెన్..ఏది గెలుస్తుందో మరి..!”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

