‘స్వాతిముత్యం’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు బెల్లంకొండ గణేష్. ఆయన రెండో చిత్రాన్ని ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ సంస్థ తెరకెక్కిస్తున్నది. ఈ సినిమా ద్వారా రాఖీ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘నాంది’ సతీష్‌వర్మ నిర్మాత. వినూత్నమైన థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘నేను స్టూడెంట్ సర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శుక్రవారం టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఇందులో బెల్లంకొండ గణేష్ తన స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్‌ను చూపిస్తుండగా చుట్టూ పోలీసులు అతనిపై తుపాకులు గురిపెట్టడం ఇంట్రెస్టింగ్గా ఉంది. విద్యార్థి నాయకుడి కథగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలిసింది. షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నామని చిత్రబృందం పేర్కొంది.
సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటోరాంప్రసాద్, చరణ్‌దీప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అనిత్ మదాడి, సంగీతం: మహతి స్వరసాగర్, కథ: కృష్ణచైతన్య, సంభాషణలు: కల్యాణ్‌చక్రవర్తి, దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి.