Bedurulanka 2012 Movie | బెదురులంక సినిమాతో కార్తికేయ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఐదేళ్ల కిందట వచ్చిన ఆర్ఎక్స్100 తర్వాత హీరోగా మళ్లీ ఇన్నాళ్లకు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. సరిగ్గా పదకొండేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన యుగాంతం చుట్టూ ఈ సినిమా కథను రాసుకున్నాడు దర్శకుడు క్లాక్స్. కాకపోతే దాన్ని హ్యూమరస్‌గా తెరపై చూపించాడు. ఆ సంఘటనను కొందరు ఏ విధంగా క్యాష్ చేసుకున్నారనే నేపథ్యంలో ఎంటర్టైనింగ్గా చూపించాడు. రిలీజ్‌కు ముందే టీజర్, ట్రైలర్లతో సినిమాపై మంచి హైప్‌ను తీసుకొచ్చారు. దానికి తగ్గట్లే సినిమాను తొలి రోజు నుంచి మంచి పాజిటీవ్ టాక్ వచ్చింది. రూ.4 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్‌తో రంగంలోకి దిగిన ఈ సినిమా ఫైనల్ రన్లో రూ.9 కోట్లు కొల్లగొట్టి బ్లాక్‌బస్టర్ హిట్టుగా నిలిచింది.
ఇక ఈ సినిమా డిజిటల్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎంత గానో ఎదురు చూశారు. కాగా తాజాగా బెదురులంక సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో ఈ సినిమా గత అర్థ రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే బెదురులంగా అనే ఓ చిన్న పల్లెటూరు. ఎంతో సాఫీగా సాగిపోతున్న ఆ ఊరి జనాల్లో యుగాంతం వస్తుందన్న భయం వణుకు పుట్టించింది. అదే సమయంలో యుగాంతం గురించి భయపడుతున్న బెదురలంక ప్రజలను కొందరు మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. వాటి నుంచి ప్రజలు తప్పించుకుంటారా? యుగాంతం వాళ్ల జీవితాలలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? అనే విధంగా సినిమా కథ సాగుతుంది.
నేహ శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాను లౌక్య ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై రవింద్ర బెనర్జీ నిర్మించాడు. శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, సత్య, ఎల్.బి శ్రీరామ్ కీలకపాత్రలు పోషించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు స్వరాలు అందించాడు.