అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన యూత్‌ఫుల్ లవ్‌డ్రామా ‘బ్యూటీ’. జె.ఎస్.ఎస్.వర్ధన్ దర్శకుడు. విజయ్‌పాల్‌రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మాతలు. ఈ నెల 19న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఈ సినిమా సక్సెస్‌మీట్ నిర్వహించారు. ‘ ‘బ్యూటీ’ హిట్ అవుతుందని ముందే తెలుసు. ఈ సినిమాకు వచ్చిన రివ్యూలు నా జీవితంలో ఏ సినిమాకూ రాలేదు.
నా కెరీర్‌కే ఈ సినిమా స్పెషల్. ప్రతి ఒక్కరికీ కనెక్టయ్యే కథ ఇది. టీమంతా ప్రాణం పెట్టి పనిచేయడం వల్లే ఈ విజయం’ అని సీనియర్ నరేశ్ పేర్కొన్నారు. సినిమా నిజాయితీగా తీస్తే సక్సెస్ అదే వస్తుందని నిరూపించిన సినిమా ‘బ్యూటీ’ అని, ఇంతలా మూవీని ఆదరిస్తున్న ఆడియన్స్‌కి థ్యాంక్స్ అనీ హీరో అంకిత్ కొయ్య అన్నారు. ఇంకా కథానాయిక నీలఖి, దర్శకుడు వర్ధన్, నిర్మాత విజయ్‌పాల్‌రెడ్డి, రైటర్ ఆర్.వి.సుబ్రహ్మణ్యం, డీవోపీ సాయికుమార్ ధారా, జర్నలిస్ట్ ప్రభు కూడా మాట్లాడారు.