Nitish Kumar Reddy | నితీష్ రెడ్డి సెంచరీ.. ఫ్యామిలీతో ఎమోషనల్ వీడియో షేర్ చేసిన బీసీసీఐ.!
Nitish Kumar Reddy | బోర్డర్ - గవాస్కర్ టోర్నమెంట్లో భాగంగా జరిగిన నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. కష్టాల్లో ఉన్న టీమ్ఇండియాను తన బ్యాటింగ్‌తో ఫాలో ఆన్ నుంచి బయటపడేయడమే కాకుండా.. కెరీర్లో తొలి అంతర్జాతీయ శతకం నమోదు చేశాడు.
Nitish Kumar Reddy | బోర్డర్ – గవాస్కర్ టోర్నమెంట్లో భాగంగా జరిగిన నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. కష్టాల్లో ఉన్న టీమ్ఇండియాను తన బ్యాటింగ్‌తో ఫాలో ఆన్ నుంచి బయటపడేయడమే కాకుండా.. కెరీర్లో తొలి అంతర్జాతీయ శతకం నమోదు చేశాడు. టెస్ట్‌లో ఎనిమిదో స్థానంలో వచ్చి సెంచరీ కొట్టడమే కాకుండా.. ఈ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నితీశ్ రెడ్డి సెంచరీ కొట్టినప్పుడు ఆయన తండ్రి ముత్యాల రెడ్డి భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇదిలావుంటే.. తొలి టెస్టు సెంచరీతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన నితీష్ రెడ్డిని తన ఫ్యామిలీ తాజాగా కలుసుకుంది. మ్యాచ్ అనంతరం నితీష్ ఉన్న హోటల్‌కి వచ్చిన అతడి కుటుంబం నితీష్‌ని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. నితీష్ తండ్రి కూడా ఆనందంతో అతడిని గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా నితీష్ తండ్రి తెలుగులో మాట్లాడుతూ.. ఈరోజు నితీష్ చాలా బాగా ఆడాడు. ఒక తండ్రిగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు ఇండియా తరపున ఆడాలని అతడి కళ ఈరోజు నేరవేరింది. నితీష్ చెల్లి తేజస్వీ మాట్లాడుతూ.. ఇది సాధారణ ప్రయాణం అయితే కాదు. నేను ఒక్కటే చెప్పాలి అనుకుంటున్నా.. అతడు చెప్పాడు.. అతడు చేసి చూపించాడు అంటూ తేజస్వీ చెప్పుకోచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
𝐓𝐞𝐚𝐫𝐬 𝐨𝐟 𝐣𝐨𝐲 𝐡𝐚𝐯𝐞𝐧’𝐭 𝐬𝐭𝐨𝐩𝐩𝐞𝐝 𝐫𝐨𝐥𝐥𝐢𝐧𝐠.
The Reddy family has been a bundle of emotions today. Witness the magical moment as they embrace Nitish after he wowed the world with his extraordinary maiden Test century at the MCG.
A day etched in memories… pic.twitter.com/uz9mrASuRm
— BCCI (@BCCI) December 28, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

