హైదరాబాద్: బాలీవుడ్ బీట్స్‌కు డిస్కో కిక్ ఇచ్చిన బప్పిలహరి ఇవాళ కన్నుమూశారు. 1982లో రిలీజైన డిస్కో డ్యాన్సర్ చిత్రం ఆయన కెరీర్లో ఓ మెగా హిట్. ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇదో సెన్షేషనల్ మూవీ. మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన ఈ చిత్రంలోని పాటలు ఆ నాటి కుర్రకారును ఊపేశాయి. డిస్కో బీట్స్‌ను ఆ తరం యువత తెగ ఎంజాయ్ చేసింది. కోయి యహా నాచే నాచే పాటకు స్టెప్పులెయ్యని ఫిల్మ్ అభిమాని లేడు. ఐ యామ్ ఎ డిస్కో డ్యాన్సర్ సాంగ్ కూడా ఓ ట్రెండ్ సెట్టర్. డిస్కో డ్యాన్సర్ సినిమాలోని సౌండ్‌ట్రాక్ అప్పట్లో ఓ స్పెషల్. కోయి యహా నాచే నాచే పాటలో ఉన్న ట్యూన్స్ ఓ వెరైటీ. డ్యాన్సర్లకు ఆ సాంగ్ ఇచ్చిన థ్రిల్ అంతా ఇంతా కాదు. పాట వింటుంటే ఎవరైనా ఊగిపోవాల్సిందే. ప్యూర్ డిస్కో బీట్స్ ఆ సాంగ్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఆ పాటలోని అవ్వ అవ్వ అంటూ వచ్చే సౌండ్‌ట్రాక్ ఇచ్చే కిక్కు కూడా మరో హైలెట్. ఫారూక్ కైసర్ ఈ పాటను రాశారు. కోయి యహా నాచే నాచే సాంగ్‌లో ఉన్న ట్యూన్స్ అన్నీ సూపర్ స్వీట్. కిసికా దిల్ నాచే నాచే అన్నట్లూ ప్రతి ఒక్కర్ని టెంప్ట్ చేస్తుంది. ఈ సాంగ్‌ను బిప్పిలహరి, ఉషా ఉతప్ పాడారు. డిస్కో లైట్స్.. టైట్ వైట్ ప్యాంట్స్.. ఓ మాయాలోకంలోకి వెళ్లినట్లు డిస్కో గెటప్ ఉంటుంది.
డిస్కో డ్యాన్సర్ ఫిల్మ్‌లోని ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్ సాంగ్ కూడా ఓ ప్రత్యేకం. ఆ సాంగ్ ఇచ్చిన పంచ్ ఇప్పటికీ ఎందరో స్టార్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది. స్ట్రీట్ మ్యూజిషియన్‌గా ఉండే జిమ్మీ.. ఎలా ఓ సూపర్ స్టార్ సింగర్‌గా మారుతాడో ఈ ఫిల్మ్‌లో చూపిస్తారు. డిస్కో డ్యాన్సర్ టైటిల్ ట్రాక్ కూడా ఆనాటి యువతను మిథున్ స్టెప్పులకు కట్టిపడేసింది. నిజానికి ఈ ఫిల్మ్‌లో అన్ని సాంగ్స్ సూపర్‌హిట్. కొత్త ట్రెండ్‌లో సాగిన ఆ మ్యూజికల్ మూవీలో ఉన్న సాంగ్స్ రకరకాల ఫిల్మీ లవర్స్‌ను థ్రిల్ చేసింది. జిమ్మీ జిమ్మీ జిమ్మీ ఆజా.. ఈ సాంగ్ కూడా ఓ స్పెషల్. పార్వతీ ఖాన్ ఈ పాటను పాడారు. డిస్కో డ్యాన్సర్ చిత్రంలో ఈ సాంగ్ కూడా క్రేజీ హిట్ కొట్టింది. ఈ ఫిల్మ్‌లో ఇన్ని డిస్కో ట్యూన్స్ ఇచ్చిన బిప్పిలహరి నిజంగానే డిస్కో కింగ్. ఇక ఇదే ఫిల్మ్‌లో ఉన్న యాద్ ఆ రహా హై సాంగ్ కూడా ఓ డిఫరెంట్ ట్రాక్. బిప్పిలహరి ఈ పాటను పాడారు. డిస్కో ట్రాక్‌లో ఈ సాంగ్ కూడా స్పెషల్ ట్యూన్‌గా నిలిచింది. ఆ రోజుల్లో ఇండియాలో బాక్సాఫీసు బద్దలు కొట్టింది డిస్కో డ్యాన్సర్ మూవీ. ఇండియాలోనే కాదు.. రష్యాలోనూ ఇది పెద్ద సక్సెస్ సాధించింది. డిస్కో ప్రేమికులు ఎన్నటికీ బప్పిలహరిని మరిచిపోరు.