Mahaveerudu | కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం మావీరన్. తెలుగులో మహావీరుడు (Mahaveerudu) టైటిల్‌తో రిలీజ్ కానుంది. మడొన్నే అశ్విన్ (Madonne Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ బంగారుపేటలోన లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు. రెహ్మాన్ రాసిన ఈ పాటను భరత్ శంకర్ కంపోజిషన్‌లో అదితి శంకర్, భరత్ శంకర్ కలిసి పాడారు. హీరోహీరోయిన్ల మధ్య సరదా ట్రాక్‌తో సాగుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.
మహావీరుడులో స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ (Aditi Shankar) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం జులై 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మావీరన్లో టాలీవుడ్ యాక్టర్ సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నాడు.
శివకార్తికేయన్ దీంతోపాటు అయలాన్ (Ayalaan) చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అయలాన్ ఫస్ట్ లుక్ పోస్టర్లో శివకార్తికేయన్ గగనంలో విహరిస్తుండగా.. అతడితోపాటే ఏలియన్ కూడా వెళ్తుండటం చూడొచ్చు.
బంగారుపేటలోన లిరికల్ వీడియో సాంగ్
The wait is over!😎 #Bangaarupetalona song out now!🎺🎵
▶️ https://t.co/YWMl5aaMXB #Mahaveerudu #MahaveeruduOnJuly14th #Maaveeran @Siva_Kartikeyan
🎵A @bharathsankar12 Musical!🥁
🎙️ #BharathSankar & @AditiShankarofl
✍🏼 @LyricistRahman @madonneashwin @iamarunviswa…— Shanthi Talkies (@ShanthiTalkies) June 21, 2023
మావీరన్ టైటిల్ అనౌన్స్మెంట్..