పవన్ కళ్యాణ్‌కి అభిమానులే కాదు భక్తులు కూడా ఉన్నారు.అందులో ఒకరు నిర్మాత బండ్ల గణేష్. పవన్ పేరు వింటేనే ఆయన పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. ఇక ఆయన ముందు ఉంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్నాళ్లు పవన్ నా దేవుడు అని పిలుచుకున్నబండ్ల ఇటీవల తన ఫేవరేట్ స్టార్‌కి దేవర అని పేరు పెట్టుకున్నాడు.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే బండ్ల గణేష్ అప్పుడప్పుడు పవన్‌కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తుంటాడు.
తాజాగా పవన్ కళ్యాణ్ చిన్ననాటి ఫొటో షేర్ చేస్తూ.. ఈ పసివాడే నా దేవర అంటూ కామెంట్ పెట్టారు.బండ్ల గణేష్ షేర్ చేసిన పిక్‌లో పవన్ కళ్యాణ్ .. పొట్టి నిక్కరు, కాటన్ షర్ట్ ధరించి చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ పిక్ మెగా అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో ‘హరిహర వీరమల్లు’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌లో రానాతో కలిసి నటిస్తున్నాడు.