తమిళంలో విమర్శకుల ప్రశంసలు పొందిన ‘ఉత్త సిరుప్పు సైజు 7’ చిత్రాన్ని తెలుగులో ‘డేగల బాబ్జీ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఒకే ఒక పాత్రతో నడిచే చిత్రమిది. బండ్ల గణేష్ హీరోగా పరిచయమవుతున్నారు. వెంకట్చంద్ర దర్శకుడు. యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతిచంద్ర నిర్మించారు. ఈ నెల 20న విడుదలకానుంది. బండ్ల గణేష్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్స్ ఉన్నా వాళ్ల వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. ఓ హత్య కేసులో పోలీస్ విచారణ ఎదుర్కొన్న వ్యక్తి కథ ఇది. తమిళంలో పార్థీబన్ నటించగా..ఆయనకు జాతీయ అవార్డును సంపాదించిపెట్టింది. నటుడిగా నాలోని కొత్త కోణాన్ని వెలికితీసే చిత్రమవుతుంది’ అన్నారు. బండ్ల గణేష్ అద్భుతంగా నటించాడని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ దేవినేని, కథ: ఆర్.పార్థీబన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: లైనస్ మధిరి.