హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ సంచలన ప్రకటన చేశాడు. గబ్బర్ సింగ్, బాద్షా, టెంపర్ లాంటి చిత్రాలను నిర్మించి మంచి పేరు సంపాదించుకున్న బండ్ల గణేశ్.. గత కొద్ది సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన.. రాజకీయాల్లోకి వచ్చారు. కానీ రాజకీయాల్లో ఆ నిర్మాత సఫలీకృతులు కాలేదు. దీంతో గతేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించి, అందర్నీ మెప్పించాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో త్వరలోనే సినిమా తీస్తానని కొద్ది నెలల క్రితం బండ్ల గణేశ్ ప్రకటించాడు.
ఇటీవలే మైసూరులోని సచ్చిదానంద ఆశ్రమాన్ని బండ్ల గణేశ్ సందర్శించి, ఆధ్యాత్మిక గురువు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఇక ఈ ఫోటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. అప్పాజీ జీవిత చరిత్ర నేనే చేసి తీరుతా… అయన పాదాల సాక్షిగా నాకు అనుమతించారు…ఎవరి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు.. అని ట్యాగ్ చేశారు బండ్ల గణేశ్. ఈ బయోపిక్కు సంబంధించిన వివరాలను ఆయన త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
డేగల బాబ్జీ ( Degala Babji ) చిత్రంలో బండ్ల గణేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన ఓ చిత్రానికి రీమేక్. వెంకట్ చంద్ర దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ అదరగొట్టింది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
అప్పాజీ జీవిత చరిత్ర నేనే చేసి తీరుతా… అయన పాదాల సాక్షిగా నాకు అనుమతించారు…ఎవరి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు..🙏 pic.twitter.com/JqqY06pvTt
— BANDLA GANESH. (@ganeshbandla) October 24, 2021