Balakrishna | ఇండస్ట్రీలో కొన్ని వార్స్ భలే ఉంటాయి. వాళ్లు పోటీ పడుతున్నారంటే మాత్రం అందరి కళ్లు వాళ్లపైనే ఉంటాయి. టాలీవుడ్లో అలాంటి రైవల్రీ బాలయ్య, రవితేజ మధ్య ఉంది. ఈ ఇద్దరి సినిమాలు ఒకేసారి పోటీ పడ్డాయంటే మాత్రం విజయం రవితేజను వరిస్తుంది. ఇప్పటి వరకు బాలయ్యపై 100 శాతం ట్రాక్ రికార్డు మెయింటైన్ చేస్తున్నాడు మాస్ రాజా. ఈ ఇద్దరి సినిమాలు గతంలో మూడుసార్లు పోటీ పడితే.. రవితేజ క్లీన్ స్వీప్ చేశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన బాలయ్య సినిమాలు రవితేజ ముందు నిలబడలేకపోయాయి. కానీ ఈ సారి సీన్ అంత ఈజీగా ఉండదు. అప్పుడు బాలయ్య వేరు.. ఇప్పుడు వేరు. ఇక్కడున్నది బాలయ్య 2.0.. రా చూసుకుందాం అంటున్నారు ఫ్యాన్స్. పరిస్థితులు చూస్తుంటే ఈ సారి బాలయ్యను ఢీ కొట్టడం రవితేజకు అంత ఈజీ కాదేమో అనిపిస్తుంది.
దసరాకు భగవంత్ కేసరితో బాలయ్య.. టైగర్ నాగేశ్వరరావుతో రవితేజ ఒక్క రోజు గ్యాప్‌లోనే వస్తున్నారు. రెండు సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాలయ్య సినిమాపై కూసింత ఎక్కువగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బిజినెస్ పరంగా చూసుకున్నా.. ఈ సారి రవితేజను భారీ మార్జిన్‌తో దాటేశాడు బాలకృష్ణ. దాంతో కేసరితో టైగర్ పోరు ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది.
గతంలో 2008లో ఒక్కమగాడుపై కృష్ణ సినిమాకు సంక్రాంతికి తీసుకొచ్చాడు రవితేజ. అలాగే 2009లో మిత్రుడు, కిక్ సినిమాలు వారం రోజుల గ్యాప్‌లో వచ్చాయి. ఇక 2011 సంక్రాంతికి పరమవీరచక్రతో బాలయ్య వస్తే.. మిరపకాయ్ అంటూ రవితేజ వచ్చాడు. ఈ మూడు సార్లు కూడా మాస్ రాజాదే పై చేయి అయింది. కానీ ఈ సారి అలా ఉండకపోవచ్చు. బాలయ్య కూడా రవితేజ లెక్క సరిచేయాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే లయన్, టైగర్ కొట్టుకుంటుంటే.. మధ్యలో మెల్లిగా దూరిపోతున్నాడు విజయ్. ఈయన నటించిన లియో అక్టోబర్ 19నే విడుదల కానుంది. మొత్తానికి ఈ దసరా బాక్సాఫీస్ దగ్గర మామూలుగా ఉండేలా లేదు