నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకుడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్లో జరిగిన పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘బాలకృష్ణ, బోయపాటి కలయికలో రానున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఆడియన్స్ పల్స్ తెలిసిన బోయపాటి ఈ సినిమాలో బాలకృష్ణను ఇప్పటి వరకు చూడని సరికొత్త పాత్రలో చూపిస్తున్నాడు. ఈ సినిమాపై వున్న అంచనాలను తప్పకుండా రీచ్ అవుతుందనే నమ్మకం వుంది. బాలకృష్ణ అఘోరాగా కనిపించబోతున్నాడు.త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు.