Balakrishna Squid game | ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్‌లలో స్క్విడ్ గేమ్ ఒకటి. ప్రాణాలను పణంగా పెట్టి ఆడే ఈ సర్వైవల్ గేమ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా వచ్చి రికార్డు వ్యూస్ అందుకుంది. 3 సీజన్లు రాగా.. అన్ని బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. అయితే ఏఐ వచ్చిన తర్వాత ఈ వెబ్ సిరీస్‌లో ఇండియన్ సెలబ్రిటీలు పాల్గోంటే ఎలా ఉంటుందో అని నెటిజన్లు వీడియోలు క్రియేట్ చేస్తున్న చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నటుడు బాలకృష్ణతో పాటు రాజీవ్ కనకాల, యాంకర్ అనసూయ ఈ గేమ్‌లో పాల్గోన్నట్లు వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఎప్పుడు సినిమాలల్లో చనిపోయే పాత్రలో కనిపించే రాజీవ్ కనకాల ఇందులో కూడా చనిపోగా బాలయ్య తన ఆవేశంతో ఇచ్చిన టాస్క్ పూర్తి చేయడు. దీంతో రైడర్స్ అతడిని తీసుకుని వెళుతుండగా.. అఖండ 2 టీజర్లో శూలం తిప్పినట్లు ఇందులో తిప్పి శత్రువులందరిని చితకొట్టేస్తాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
— Out of Context Telugu (@OutOfContextTel) July 17, 2025