NBK107 Latest Poster | ‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. అదే జోష్‌తో తన తదుపరి సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపిచంద్ మలినేని, బాలకృష్ణతో సినిమా చేయనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన బాలయ్య ఫస్ట్‌లుక్ పోస్టర్ అంచనాలను రెట్టింపు చేసింది. ఇదిలా ఉంటే మేకర్స్ తాజాగా సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మరో మాస్ పోస్టర్‌ను విడుదల చేశాడు.
ఈ పోస్టర్లో బాలకృష్ణ చేతిలో కత్తి పట్టుకుని రౌద్రంతో రగిలి పోతున్నాడు. ఈ చిత్రానికి జై బాలయ్య అనే టైటిల్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. బాలకృష్ణ ఈ చిత్రంలో జయకృష్ణ, బలరామకృష్ణ అనే రెండు పాత్రలలో నటించనున్నాడు. బాలయ్యకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్గా నటించనుంది. మలయాళ బ్యూటీ హనీరోజ్ సెకండ్ హీరోయిన్గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.
#NBK107 🔥🔥 pic.twitter.com/lTR9poxqfi
— Mythri Movie Makers (@MythriOfficial) May 28, 2022