Balakrishna | నందమూరి బాలకృష్ణ ఫోకస్ మార్చారు!
బాలకృష్ణ ప్రస్తుతం సినిమాల వైపుకు తన ఫోకస్‌ను మార్చాడు. ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశల్లో కూడా పాల్గొనకుండా సినిమా చర్చల్లో వున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ మీటింగ్‌ల్లో, ప్రచారంలో బిజీ బిజీగా గడిపారు నందమూరి బాలకృష్ణ. ఇక ఎన్నికల ఫలితాల్లో కూటమీ భారీ విజయం సాధించి తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయిడు సీఎం కావడంతో బాలకృష్ణ రిలాక్స్ అయ్యారు. ఈ నందమూరి వారసుడు కూడా మూడో సారి శాసనసభ్యనిగా భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందుండి నడిపిస్తున్నారు.
ఎన్నికల సమయంలో సినిమాల షూటింగ్‌లకు దూరంగ వున్న బాలకృష్ణ ప్రస్తుతం సినిమాల వైపుకు తన ఫోకస్‌ను మార్చాడు. ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశల్లో కూడా పాల్గొనకుండా సినిమా చర్చల్లో వున్నారు. ఆయన ప్రస్తుతం బాబీ దర్శకత్వలో నటిస్తున్న సినిమా షూటింగ్ కోసం శ్రీలంక వెళ్లాడు. ఈ చిత్రాన్ని నవంబర్ వరకు పూర్తిచేసే యోచనలో వున్నారు నిర్మాతలు. ఈ సినిమా తరువాత తన కెరీర్లో సింహా, లెజెండ్, అఖండ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వలో అఖండ-2 షూటింగ్లో పాల్గొన్ననున్నాడు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ చిత్రం అఖండకు సీక్వెల్‌గా రూపొందనుంది.
ఈ చిత్రానికి బాలకృష్ణ చిన్న కూతరు తేజస్విని కూడా మరో నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. ఈ సినిమాల తరువాత దిల్ రాజు నిర్మాతగా బాలకృష్ణ హీరోగా ఓ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే బాలకృష్ణ రెండు సినిమాల్లో ఒకేసారి సైమల్టైనిస్గా పూర్తిచేయాలనే ఆలోచనలో వున్నారట. దీంతో పాటు తన కొడుకు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై జరుగుతున్న కథా చర్చల్లో బాలకృష్ణ రెగ్యులర్‌గా పాల్గొంటున్నాడని తెలిసింది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్క్ష తొలిచిత్రం వుంటుందని అంటున్నాయి సినీ వర్గాలు.
Read Also :
Pushpa 2 The Rule | అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మళ్లీ వాయిదా..? ఏంటీ కారణమిదేనా.. !
Chiranjeevi | పారిస్ వీధుల్లో చిరంజీవి ఫ్యామిలీ ఇలా..
Allu Arjun | అల్లు అర్జున్ తొలిజీతం ఎంతో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

