Balakrishna | సిల్వర్ స్క్రీన్‌పైకి కొన్ని కాంబినేషన్లు వస్తున్నాయంటే రికార్డులు, కలెక్షన్ల గురించే అంతటా చర్చ నడుస్తుంది. ఇప్పడలాంటి టాపిక్ నడిచే సమయం రానే వచ్చింది. హ్యాట్రిక్ కాంబోగా రికార్డులు సృష్టించిన బోయపాటి శ్రీను-నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో వసూళ్ల సునామి సృష్టించిన బాలకృష్ణ (Balakrishna)-బోయపాటి (Boyapati Srinu) త్వరలోనే కొత్త ప్రాజెక్టును ప్రకటించబోతున్నారని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
14 రీల్స్ ప్లస్ బ్యానర్లో ఈ సినిమా రాబోతుండగా.. తాజా టాక్ ప్రకారం మార్చి 25న దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. టాలీవుడ్ నుంచి పలువురు పాపులర్ నటీనటులు ఈ ప్రాజెక్టులో భాగం కాబోతుండగా.. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. రామ్‌తో బోయపాటి చివరగా స్కంద సినిమా చేయగా.. బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ టాక్ మూటగట్టకుంది. ఈ సారి బాలయ్యతో ఎప్పటిలాగే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని కసిగా ఎదురుచూస్తున్నాడని అర్థమవుతోంది.
అఖండకు సీక్వెల్ రాబోతుందని ఇప్పటికే హింట్ ఇచ్చేశాడు బోయపాటి. మరి నయా ప్రాజెక్టు సీక్వెల్ సినిమానా..? లేదంటే కొత్త సినిమా ప్రకటిస్తాడా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. మరి బోయపాటి ఈ సారి ఎలాంటి కథాంశంతో గ్రాండ్ కమ్ బ్యాక్ ఎంట్రీ ఇస్తాడోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. కథ, జోనర్ ఏదైనా సరే బోయపాటి-బాలయ్య సినిమా అంటే హిట్టు గ్యారంటీ. ఇదే ధీమాతో కొత్త అప్డేట్స్ కోసం వెయిటింగ్ ఇక్కడ అంటున్నారు నందమూరి అభిమానులు.
బాలకృష్ణ ప్రస్తుతం బాబీ (Bobby) డైరెక్షన్లో NBK 109 సినిమా చేస్తున్నాడని తెలిసిందే. బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలయ్య చేతిలో గొడ్డలి పట్టుకొని జీపులో నుంచి దిగుతున్నట్టుగా ఉన్న NBK 109 స్టిల్ ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది
Get ready to witness the COOLEST & CRUELLEST form of #NBK, this Maha Shivarathri! 🪓🔥#NBK109Glimpse ~ Unveiling Tomorrow! 🤘💥 #NBK109 #NandamuriBalakrishna @thedeol @Vamsi84 @KVijayKartik #SaiSoujanya @chakrif1 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/bNkeQkzqah
— Bobby (@dirbobby) March 7, 2024