Bhagwant kesari | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద రికార్డుల గురించి మాత్రమే చర్చ నడుస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సీనియర్ హీరో టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి (Bhagwant kesari). మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. పెండ్లి సందD ఫేం శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun rampal) కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్‌లో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ అదరగొట్టేస్తున్నాడు. గీసారి మోత మోగిపోయే అప్డేట్తో ఒస్తున్నం.. మీ అంచనాలను ఆకాశమంత ఎత్తులో ఉంచండి.. అంటూ భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్‌ను రేపు సాయంత్రం 4:05 గంటలకు లాంఛ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. థమన్ కంపోజిషన్‌లో సాంగ్స్ ఉండబోతుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. చిత్రయూనిట్ మెంబర్స్ బాలకృష్ణ పాపులర్ డైలాగ్స్‌తో కట్ చేసిన వీడియో ఒకటి మేకర్స్ షేర్ చేయగా నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
భగవంత్ కేసరి మూవీని ఓవర్సీస్లో పాపులర్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ హౌజ్ సరిగమ సినిమాస్ విడుదల చేయనుంది. అక్టోబర్ 18న యూఎస్ఏలో గ్రాండ్‌గా ప్రీమియర్స్ ఉండబోతున్నాయని ఇప్పటికే మేకర్స్ స్పెషల్ వీడియోను షేర్ చేయగా.. నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. బిగ్ స్క్రీన్‌పై బాలకృష్ణను ఇదివరకెన్నడూ చూడని అవతార్‌లో చూసి అక్టోబర్ 19న పండగ చేసుకోవడం గ్యారంటీ.. అంటూ విడుదల తేదీని తెలియజేస్తూ అందించిన అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు, సినీ జనాలు.
బాలకృష్ణ ఈ సారి భగవంత్ కేసరిగా తెలంగాణ యాసలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నాడని గ్లింప్స్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు అనిల్ రావిపూడి. భగవంత్ కేసరి చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు గూస్ బంప్స్ తెప్పించే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్ థమన్ మరోసారి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
గీసారి మోత మోగిపోయే అప్డేట్ తో ఒస్తున్నం 😎#BhagavanthKesari First Single Announcement Tomorrow at 4:05 PM❤️🔥
Keep your expectations sky-high 🔥
A @MusicThaman Musical 🥁#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @JungleeMusicSTH @rampalarjun… pic.twitter.com/zBYuzcsScf
— Shine Screens (@Shine_Screens) August 23, 2023
Glad to be joining forces with the most successful @sarigamacinemas to bring our most prestigious film #BhagavanthKesari to the overseas audience ❤️🔥
Massive USA Premieres on Oct 18th 🔥 https://t.co/BXfZeJSbMr
— Shine Screens (@Shine_Screens) August 18, 2023
భగవంత్ కేసరితో అర్జున్ రాంపాల్..
It’s a wrap for me on my film #bhagwantkesari I was so nervous when I came here to shoot my first Telugu film. I can confidently say now have had an absolute blast filming it. All this would not have been possible without the energy of my big brother #balakrishna thank you bro… pic.twitter.com/urHmQeQ070
— arjun rampal (@rampalarjun) August 14, 2023
భగవంత్ కేసరి టీజర్..